facebook pixel
chevron_right Business
transparent
బ్యాంకు వద్దు.. ఇల్లే ముద్దు!
కరెన్సీ కష్టాలు మళ్లీ మొదలవడంతో జనాలు జాగ్రత్త పడుతున్నారు. చేతికొచ్చిన నగదును చేజారిపోనివ్వడం లేదు. గతకొద్ది నెలలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లేగాక దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. నగదు కొరత దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోట్ల ముద్రణను పెంచినా. డిపాజిట్ల కంటే బ్యాంకుల్లో విత్‌డ్రాలే ఎక్కువయ్యాయి మరి. ఆర్బీఐ తాజా వివరాల ప్రకారం ఈ నెల మొదటి మూడు వారాల్లో బ్యాంకుల నుంచి రూ.59,520 కోట్ల నగదు ఉపసంహరణ జరిగింది. అంతకుముందు మూడు వారాల్లో ఇది రూ.16,470 కోట్లుగా ఉండగా, ఒక్క ఏప్రిల్ 20తో ముగిసిన వారం రోజుల్లోనే రూ.16,340 కోట్లను జనాలు తిరిగి తీసేసుకోవడం గమనార్హం.
ఐడీబీఐలో మరో మోసం
దేశీయ బ్యాంకింగ్ రంగంలో కుంభకోణాలు, రుణాల ఎగవేతలు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. రోజుకో బాగోతం బయటపడుతూనే ఉన్నది. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐలో రూ.600 కోట్ల రుణ ఎగవేత వ్యవహారానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. ఎయిర్‌సెల్ మాజీ ప్రమోటర్ సీ శివశంకరన్‌కు చెందిన రెండు కంపెనీలతోపాటు సిండికేట్ బ్యాంక్ ఎండీ, సీఈవో మెల్విన్ రెగో, ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈవో కిశోర్ ఖారత్‌లపై ఈ కేసును దాఖలు చేసినట్లు గురువారం సీబీఐ అధికారులు తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్ మాజీ డిప్యూటీ ఎండీ అవగా, ఖారత్. ఐడీబీఐ మాజీ ఎండీ, సీఈవో.
యాక్సిస్‌ బ్యాంక్‌ షాక్‌!
దేశీ బ్యాంకింగ్‌ రంగానికి మొండిబకాయిలు(ఎన్‌పీఏ) తూట్లు పొడుస్తున్నాయి. ప్రైవేటు రంగంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంక్‌. యాక్సిస్‌ బ్యాంకుకు ఈ సెగ గట్టిగానే తగిలింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2017-18, క్యూ4)లో బ్యాంక్‌ అనూహ్యంగా రూ.2,189 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ రూ.1,225 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 1998లో యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన తర్వాత, అంటే రెండు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా త్రైమాసిక నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ప్రధానంగా మొండిబకాయిలు భారీగా పెరిగిపోవడంతో, వాటికి కేటాయింపులు(ప్రొవిజనింగ్‌) ఎగబాకడమే ఈ నష్టాలకు కారణంగా నిలిచింది. క్యూ4లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.14,181 కోట్ల నుంచి రూ.14,560 కోట్లకు చేరింది.
ఫోర్డ్‌ తొలి సీయూవీ 'ఫ్రీస్టయిల్‌'
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ దేశంలోనే తొలి కాంపాక్ట్‌ యుటిలిటీ వెహికల్‌ (సీయూవీ) ఫ్రీస్టయిల్‌ని విపణిలోకి విడుదల చేసింది. స్పోర్టీ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) డిజైన్‌తో, సాంకేతికత, అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేశామని ఫోర్డ్‌ సేల్స్‌ ప్రొడక్షన్‌ జీఎం ఆంటోని చీరియన్‌ కురియన్‌ గురువారమిక్కడ జరిగిన విలేకరులకు తెలిపారు. ఫ్రీస్టయిల్‌ పెట్రోల్, డీజిల్‌ రెండు వెర్షన్లలో నాలుగు వేరియంట్లలో 6 రంగుల్లో అందుబాటులో ఉంది. ధరల శ్రేణి రూ.5.09-7.89 లక్షల మధ్య ఉంది. దీన్ని గుజరాత్‌లోని సాణంద్‌ ప్లాంట్‌లో అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు.
హాంకాంగ్ నుంచి నీరవ్ జంప్
భారత్‌లో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణానికి పాల్పడి దేశం నుంచి జారుకున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి, సెలబ్రిటీ జువెల్లర్ నీరవ్ మోదీ అందరూ భావిస్తున్నట్లు ప్రస్తుతం హాంకాంగ్‌లో కాకుండా అమెరికాలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. దాదాపు రూ.14 వేల కోట్ల కుంభకోణంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను చావుదెబ్బ తీసిన నీరవ్ మోదీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన భారత పాస్‌పోర్టుతోనే ప్రయాణాలు సాగిస్తున్నాడని, ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లో ఉన్నట్లు తెలుస్తున్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏ దేశమైనా ఒక ప్రయాణికుడిని అనుమతించదల్చుకుంటే ఇక అతని పాస్‌పోర్టు సస్పెండ్ అయిందా? అనేది సమస్య కాబోదని ఆ వర్గాలు తెలిపాయి.
పెట్రో మంట ఆందోళనకరమే..
పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ మండిపోతుండటంతో వినియోగదారులపై పడుతున్న భారం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అయితే ఈ విషయంలో అటు వినియోగదారుల ప్రయోజలను, ఇటు దేశ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమతూకాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఉద్ఘాటించారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ రిటైల్ ధర 55 నెలల గరిష్ఠ స్థాయికి ఎగబాకగా, డీజిల్ ధర ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లిన విషయం విదితమే. దీంతో వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్లు రోజు రోజుకూ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం లేదు.
భారత్‌లో రూ. 650 కోట్ల పెట్టుబడులు: జియోనీ
మొబైల్స్‌ తయారీ సంస్థ జియోనీ 2018లో భారత మార్కెట్లో దాదాపు రూ. 650 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ ఏడాది భారత్‌లోని టాప్‌ 5 స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్స్‌లో ఒకటిగా నిలవాలని నిర్దేశించుకున్నామని, ఇందులో భాగంగా గతేడాది పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే 30 శాతం అధికంగా ఇన్వెస్ట్‌ చేయనున్నామని జియోనీ ఇండియా నేషనల్‌ సేల్స్‌ డైరెక్టర్‌ అలోక్‌ శ్రీవాస్తవ తెలిపారు. జియోనీ గతేడాది మార్కెటింగ్‌పై రూ. 500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. 20,000 స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో 20 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు అలోక్‌ వివరించారు. కొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కొత్త ఫోన్స్‌లో ఎఫ్‌205 (ధర రూ. 8,999), ఎస్‌11 (రేటు రూ.
రిలయన్స్‌ క్యాపిటల్‌ డివిడెండ్‌ రూ.11
రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.428 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆర్జించిన నికర లాభం (రూ.428 కోట్లు)తో పోల్చితే 36 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,007 కోట్లుగా ఉందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016-17లో రూ.1,086 కోట్లుగా ఉన్న నికర లాభం 2017-18లో 21% వృద్ధితో రూ.1,309 కోట్లకు పెరి గిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.19,898 కోట్లుగా ఉందని పేర్కొంది.
టీసీఎల్‌ నుంచి ఐఫాల్కన్‌ స్మార్ట్‌ టీవీలు
చైనాకు చెందిన టీసీఎల్‌ మల్టీమీడియా తాజాగా భారత మార్కెట్లోకి ఐఫాల్కన్‌ బ్రాండ్‌ కింద స్మార్ట్‌ టీవీలు ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆఖరు నాటికి 2 లక్షల టీవీలు విక్రయించాలని నిర్దేశించుకుంది. అమ్మకాల కోసం ప్రధానంగా ఆన్‌లైన్‌ వ్యూహాన్నే అనుసరించనున్నట్లు ఫాల్కన్‌ టెక్నాలజీ గ్లోబల్‌ సీఈవో టోనీ గో తెలిపారు. ఇందులో భాగంగా ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా విక్రయ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం టీవీలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నామని, అమ్మకాలను బట్టి ఏడాది తర్వాత స్థానికంగా కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయని టోనీ వివరించారు. ప్రస్తుతం షావోమి, వ్యు, థామ్సన్‌ తదితర సంస్థలు చౌకగా స్మార్ట్‌ టీవీలను విక్రయిస్తున్నాయి.
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్‌
18 భారత్‌ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 8.67 శాతం తగ్గాయి. 2016-17లో రూ.2,89,207 కోట్లుగా ఉన్న ఈ ఎగుమతుల విలువ 2017-18లో 2,64,131 కోట్లకు తగ్గిందని రత్నాలు ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) గణాంకాలు పేర్కొన్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి 27 శాతం తగ్గిన డిమాండ్‌ దీనికి కారణమని కూడా జీజేఈపీసీ విశ్లేషించింది. యూఏఈలో జనవరిలో 5 శాతం వ్యాట్‌ను విధించిన విషయాన్ని గుర్తు చేసింది. ఎగుమతుల్లో తొలిస్థానం 33 శాతంతో హాంకాంగ్‌ నిలవగా, 25 స్థానంలో యూఏఈ, 23 స్థానంలో అమెరికా నిలిచింది.
ఎస్‌బీఐ లైఫ్‌ లాభం 13 శాతం అప్‌
ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.336 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ4లో రూ.381 కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.10,776 కోట్ల నుంచి రూ.10,052 కోట్లకు తగ్గిందని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016-17లో రూ.955 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ1,150 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.30,276 కోట్ల నుంచి రూ.33,761 కోట్లకు పెరిగాయని పేర్కొంది.
ప్రైవేట్‌ బ్యాంకుల జోరు
యస్‌ బ్యాంక్‌ ఫలితాల జోష్‌తో బ్యాంక్‌ షేర్లు జోరందుకోవడంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. బ్యాంక్‌ షేర్లతో పాటు వినియోగ, ఐటీ రంగ షేర్లు కూడా పుంజుకోవడంతో సెన్సెక్స్‌ 212 పాయింట్ల లాభంతో 34,714 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 10,618 పాయింట్ల వద్ద ముగిశాయి. ఏప్రిల్‌ సిరీస్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చోటు చేసుకోవడం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం సానుకూల ప్రభావం చూపించాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల జోరుతో మరింతగా లాభపడింది. ట్రేడింగ్‌ చివరి అరంగంట వరకూ సెన్సెక్స్‌ పరిమిత శ్రేణిలో కదలాడింది. చివరి అరంగంటలో భారీ లాభాలను సాధించింది. ఇంట్రాడేలో 246 పాయింట్ల లాభంతో 34,748 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
ఏఐ, ఎంఎల్ ప్రోగ్రామ్ విస్తరణ ఐఐఐటీ-హెచ్ వెల్లడి
టెక్నాలజీ ప్రొఫెషనల్స్ కోసం టాలెంట్‌స్ప్రింట్‌తో కలసి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) రంగాల్లో తాము ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఐఐఐటీ-హెచ్ (ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్) గురువారం ప్రకటించింది. టాలెంట్‌స్ప్రింట్ భాగస్వామ్యంతో తమ మెషీన్ లెర్నింగ్ ల్యాబ్‌లో నిర్వహించిన తొలి విడుత ఏఐ, ఎంఎల్ ఫౌండేషన్ కోర్సులు విజయవంతమయ్యాయని, మొదటి బ్యాచ్‌లో 127 టెక్ కంపెనీలకు చెందిన 400 సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఈ కోర్సులను అభ్యసించారని, వీరంతా వచ్చే నెలలో పట్టభద్రులు కాబోతున్నారని ఐఐఐటీ-హెచ్ వెల్లడించింది.
కొత్తగా 80 వేల మందికి ఉద్యోగాలు రిలయన్స్ జియో ప్రకటన
దేశీయ టెలికం మార్కెట్‌లో శరవేగంగా దూసుకెళ్తున్న రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో 80 వేల మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని భావిస్తున్నది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) ఆఫీసర్ సంజయ్ జోగ్ గురువారం వెల్లడించారు. హైదరాబాద్‌లో సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం తమ సంస్థలో సుమారు 1.57 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరో 75 వేల నుంచి 80 వేల మందిని చేర్చుకోవాలని భావిస్తున్నామని వివరించారు.
యాక్సిస్ బ్యాంక్ నష్టం రూ.2,189 కోట్లు
యాక్సిస్ బ్యాంక్ నికర నష్టం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.2,189 కోట్లుగా నమోదైంది. నిరుడు జనవరి-మార్చిలో రూ.1,225 కోట్ల లాభాన్ని పొందగా, రూ.16,000 కోట్లు ఎగిసిన మొండి బకాయిల వల్లే ఈసారి నష్టాలు వాటిల్లాయి. గతంతో పోల్చితే నికర వడ్డీ ఆదాయం దాదాపు సమానంగా రూ.4,731 కోట్లుగా ఉన్నది. యెస్ బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1,179.44 కోట్లుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో రూ.914.12 కోట్లుగా ఉన్నది. ఆదాయం ఈసారి రూ.7,163.95 కోట్లుగా, పోయినసారి రూ.5,606.38 కోట్లుగా ఉన్నది. రిలయన్స్ క్యాపిటల్ ఏకీకృత నికర లాభం ఈ మార్చి 31తో ముగిసిన మూడు నెలల్లో గతంతో పోల్చితే 36 శాతం పెరిగి రూ.428 కోట్లకు చేరింది. నిరుడు రూ.315 కోట్లకే పరిమితమైంది.
యస్‌ బ్యాంక్‌ లాభం జూమ్‌...
ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,179 కోట్ల నికర లాభం(స్టాండలోన్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సాధించిన నికర లాభం(రూ.914 కోట్లు)తో పోల్చితే 29 శాతం వృద్ది సాధించామని యస్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,606 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.7,164 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 31 శాతం వృద్ధితో రూ.2,154 కోట్లకు, వడ్డీయేతర(ఇతర) ఆదాయం 13 శాతం పెరుగుదలతో రూ.1,421 కోట్లకు పెరిగాయని వివరించింది. నికర వడ్డీ మార్జిన్‌(ఎ న్‌ఐఎమ్‌) 3.6 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గిందని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.2.70 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది.
వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌కు 30 లక్షల మంది యూజర్లు
వ్యాపార సంస్థలు, కస్టమర్స్‌ను అనుసంధానం చేసే వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ యూజర్ల సంఖ్య 30 లక్షల పైచిలుకు ఉందని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జకర్‌బర్గ్‌ వెల్లడించారు. వ్యాపార కార్యకలాపాలకు మరింతగా ఉపయోగపడేలా రాబోయే అయిదేళ్లలో తమ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్‌ వంటి యాప్స్‌ను మెరుగుపర్చడంపై దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న వాట్సాప్‌ యాప్‌. సాధారణ మెసేజింగ్‌ సర్వీసులకు ఉపయోగపడుతుండగా. వ్యాపార వర్గాల కోసం వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ ఉపయోగపడుతోంది. ప్రారంభ దశలో ఉన్న దీన్ని వాట్సాప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ ఈ ఏడాది జనవరిలో భారత్‌ సహా అమెరికా, మెక్సికో, బ్రిటన్, ఇండోనేసియా, ఇటలీ దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రస్తుతం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ప్లేస్టోర్‌లో లభిస్తోంది.
రిలయన్స్‌ జియోలో 80వేల కొలువులు
80,000 మంది దాకా సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ సంజయ్‌ జోగ్‌ తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో 1,57,000 మంది సిబ్బంది ఉన్నారని సొసైటీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. సేల్స్‌ తదితర విభాగాల్లో 32%గా ఉందని, సగటున చూస్తే మాత్రం 18% మేర ఉందని సంజయ్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా 6,000 కాలేజీలతో రిలయన్స్‌ జియో జట్టుకట్టినట్లు ఆయన తెలిపారు. 60-70 శాతం నియామకాలు కాలేజీలు, ఉద్యోగుల నుంచి వచ్చే రిఫరల్స్‌ ద్వారానే ఉంటున్నాయని సంజయ్‌ వివరించారు.
సైయెంట్ చేతికి ఆన్సెమ్ ఎన్‌వీ
హైదరాబాద్‌కు చెందిన ఐటీ రంగ సంస్థ సైయెంట్ లిమిటెడ్. బెల్జియంకు చెందిన ఆన్సెమ్ ఎన్‌వీని చేజిక్కించున్నది. తమ సైయెంట్ యూరప్ లిమిటెడ్. ఆన్సెమ్‌ను సొంతం చేసుకున్నదని గురువారం సైయెంట్ ప్రకటించింది. ఓ ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ. కాగా, ఈ లావాదేవీ వివరాలను సైయెంట్ ప్రకటించకపోయినప్పటికీ, దీని విలువ 17 మిలియన్ డాలర్లు (రూ.11 కోట్లు)గా ఉండొచ్చని తెలుస్తున్నది.
ఐడీబీఐ బ్యాంకులో 600 కోట్ల స్కామ్‌
బ్యాంకింగ్‌ రంగంలో మరో కుంభకోణం తెరపైకి వచ్చింది. ఎయిర్‌సెల్‌ మాజీ ప్రమోటర్‌ సి.శివశంకరన్‌కు గ్రూపుతో సంబంధం కలిగిన విదేశీ కంపెనీలకు ఐడీబీఐ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడం వల్ల రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందంటూ సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ. ఎయిర్‌సెల్‌ మాజీ ప్రమోటర్‌ శివశంకరన్, అతని కుమారుడు శివశంకరన్‌ శరవణన్‌తోపాటు. 2010 నుంచి 2014 వరకు (రుణాలు మంజూరైన సమయంలో) ఐడీబీఐ బ్యాంకులో పనిచేసిన ఉన్నతాధికారులతోపాటు ప్రస్తుత ఉన్నతాధికారులు మొత్తం 15 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this