facebook pixel
chevron_right Entertainment
transparent
మనం సైతం ఆధ్వర్యంలో చేయూత
సినీ రంగంలోని అవసరార్థుల కోసం ఏర్పడిన మనం సైతం సంస్థ ఆధ్వర్యంలో పలువురికి ఆర్ధిక సాయం అందించారు. జూబ్లీహిల్స్‌లోని ఫిలింఛాంబర్‌ లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ. సేవా సంస్థను మరింత అభివృద్ధి చేయాలని, దీని కోసం తన వంతుగా ఒక యాప్‌ రూపొందించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. బిగ్‌ బాస్‌ 2 విజేత కౌశల్‌ మాట్లాడుతూ ఇకపై మనం సైతం స్ఫూర్తితో కౌశల్‌ ఆర్మీ కూడా పనిచేస్తుందన్నారు. తన వంతుగా పాతిక వేల రూపాయలు విరాళం ప్రకటించారు. సీనియర్‌ నటి జయలలిత మాట్లాడుతూ. మనం సైతం ద్వారా పేదల ఆరోగ్యం, విద్య, వృద్ధులకు సహాయపడుతుండడం అభినందనీయమన్నారు. తన వంతుగా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.
వైజాగ్‌కు ఇక సెలవు
తెలుగు కళారంగంలో మరో ధ్రువతార రాలిపోయింది. ప్రముఖ సీనియర్‌ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారన్న వార్తప్రసార మాధ్యమాల ద్వారా వ్యాపించడంతో నగరమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చి ఆ తర్వాత బుల్లితెరపై కూడా నటించి ఆయన ఎందరో మనసులు గెలుచుకున్నారు. రెండేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితమయ్యారు. వైజాగ్‌ ప్రసాద్‌ ఇక లేరన్న వార్తను ఆయనఅభిమానులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేని లోటును తలచుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వస్థలం గోపాలపట్నం విషాదంతో మూగబోయింది. గోపాలపట్నం (విశాఖ పశ్చిమ)/విశాఖ కల్చరల్‌: వైజాగ్‌ ప్రసాద్‌ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద్‌. విశాఖ నగరం గోపాలపట్నం యల్లపువానిపాలెంలో ఆయన జన్మించారు.
'వైజాగ్‌' ప్రసాద్‌ ఇకలేరు
ప్రముఖ నటుడు 'వైజాగ్‌' ప్రసాద్‌(75) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారుజామున బాత్‌రూంకు వెళ్లిన ఆయన అక్కడే పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రసాద్‌ స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపురం. ఆయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. కళా రంగంలో 'వైజాగ్‌' ప్రసాద్‌గా స్థిరపడ్డారు. 1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన ఆయన 'అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్, గరీబీ హఠావో' లాంటి నాటికలతో ప్రేక్షకులను అలరించారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో 'బాబాయ్‌ అబ్బాయ్‌' చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు.
కొత్త వెలుగు తీసుకొచ్చారు
అరవింద సమేత వీర రాఘవ'. ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వాదం అందించి, ఈ చిత్రాన్ని విజయ పథంలోకి నడిపించిన అభిమాన సోదరులందరికీ నా వందనాలు. ఓ కొత్త ప్రయత్నానికి నాంది పలికిన నా ఆప్తుడు, నా కుటుంబ సభ్యుడైన త్రివిక్రమ్‌గారిపైన ప్రేక్షక దేవుళ్లందరూ వారి నమ్మకాన్ని ఇంకోసారి ఈ చిత్రంతో బహిర్గతం చేశారు. ఆయనకు రెట్టింపు ఉత్సాహం కల్పించిన ప్రేక్షక దేవుళ్లకి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అని ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
వైజాగ్ ప్రసాద్ ఇక లేరు
రంగస్థల, వెండితెర సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్(75) మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. నాటక, సినీరంగాల్లో వైజాగ్ ప్రసాద్‌గా గుర్తింపు పొందిన ఆయన అసలు పేరు కొర్లాం పార్వతీ ప్రసాదరావు. ఆయకుకు కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్ వున్నారు. అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాలధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక. వేట, వేట కుక్కలు, కాలకూటం, రుత్విక్, గరీబీ హఠావో లాంటి నాటికలతో నటుడిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. దాదాపు 700 నాటికల్లో నటించి నాటక రంగంపై తనదైన ముద్రవేశారు.
యథార్థ ఘటనల రంగు
లారా అనే విజయవాడ యువకుడిగా ఈ సినిమాలో కనిపిస్తాను. పదిహేడేళ్ల వయసు నుంచి ఇరవై ఎనిమిదేళ్ల మధ్య కాలంలో అతడి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం అని అన్నారు తనీష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రంగు. పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్ననాయుడు నిర్మాతలు. పరుచూరి రవి, ప్రియాసింగ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు విడుదలచేశారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ హీరో, విలన్‌లు ఎవరూ ఈ సినిమాలో కనిపించరు. పరిస్థితులే ఓ వ్యక్తిని మంచివాడిగా, చెడ్డవాడిగా ఎలా మార్చాయో అర్థవంతంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు అని అన్నారు.
తిత్లీ బాధితులకు అల్లు అర్జున్ ఆర్థిక సహాయం
తిత్లీ తుపాను ఉత్తరాంధ్ర జనజీవితాన్ని అతలాకుతలం చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆపన్న హస్తం అందించడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో అల్లు అర్జున్ కూడా తన వంతు సహాయంగా తిత్లీ బాధితుల సహాయార్థం శనివారం 25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ శ్రీకాకుళం ప్రజల పరిస్థితి విన్న తరువాత బాధేసింది. తుపాను ప్రభావం వల్ల జరిగిన నష్టం చూశాక నా హృదయం ద్రవించిపోయింది. తిత్లీ తుపాను బాధితులకు 25 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా. ఈ కష్ట సమయంలో మన వారికి సహాయం చేయడానికి ముందుకొద్దాం అని పేర్కొన్నారు.
మనం సైతం కోసం యాప్
ఆశ్రితులను ఆదుకుంటూ సేవాదృక్పథాన్ని చాటుకుంటున్నారు నటుడు కాదంబరి కిరణ్. మనం సైతం సంస్థ ద్వారా ఆయన పేదలకు సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం హైదరాబాద్‌లో మరికొంతమంది పేదలకు ఆర్థికసహాయాన్ని అందించారాయన. ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్, నటి జయలలిత, బిగ్‌బాస్ విజేత కౌశల్, టీవీ ఆర్టిస్ట్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ కాదంబరి కిరణ్ అన్నయ్యతో నాకు ముఫ్పైఏళ్లుగా స్నేహసంబంధాలున్నాయి. నేను సహాయ దర్శకుడిగా పని దొరక్క ఇబ్బంది పడుతున్న టైంలో ఏదో ఒక పని చెప్పి డబ్బులు ఇస్తుండేవారు. సేవా దృక్పథం కాదంబరి కిరణ్ అన్న రక్తంలోనే ఉంది. దేవుడు మనకు సహాయం చేసినా చేయకున్నా అండగా ఉండేది సాటి మనిషే అని నేను బలంగా విశ్వసిస్తాను.
నాన్న హోదాలో బాబాయ్‌ : ఎన్టీఆర్‌
'ఈ సమయంలో నాన్న ఉంటే బాగుండేదని. నాకు తెలిసి నాన్న ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తుంటారని, నాన్న లేకపోయినా నాన్న హోదాలో ఇక్కడకు వచ్చిన బాబాయ్ కు పాదాభివందనం చేస్తున్నాన'ని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు జూనియర్‌ ఎన్టీఆర్‌. అరవింద సమేత విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి పై విధంగా ఎన్టీఆర్‌ మాట్లాడాడు. ఈ సినిమా విజయానికి మీ ఆశీస్సులు అందజేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమా విజయాన్ని అభిమానులతోనే కాకుండా బాబాయ్‌తో కూడా పంచుకోవాలనుకుంటున్నానని అందుకే బాబాయ్‌ను ముఖ్య అతిథిగా పిలిచామని అన్నాడు. ఈ వేడుకలో తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదని. అభిమానులంతా బాబాయ్‌ మాటల కోసం ఎదురుచూస్తున్నారని అన్నాడు. జై హరికృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.
భావోద్వేగమైన లేఖను పోస్ట్‌ చేసిన మంచు మనోజ్‌
హీరోగానే కాకుండా, సహాయ పాత్రల్లో కూడా నటిస్తూ. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్‌. గత కొంతకాలంపాటు సరైన విజయం లేక ఈ యువ హీరో వెనుకబడ్డాడు. అయితే సినిమాలే ప్రపంచం కాదంటూ. తనకు చేతనైన సహాయం చేయడానికి బయలు దేరినట్టు ఈ హీరో సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం తిరుపతి అని, అక్కడి అణువణువు దైవత్వంతో నిండి ఉందంటూ. తను ప్రారంభించబోయే సహాయ కార్యక్రమాలు రాయలసీమ నుంచే మొదలుపెడతానని చెబుతూ. ఓ సుదీర్ఘమైన లేఖను ట్వీట్‌ చేశాడు. మంచు మనోజ్‌ షేర్‌ చేసిన లేఖ.
ఔను.. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు : వర్మ
'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం ప్రారంభించిన సందర్భంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మంతో 'సాక్షి' ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ. ఎన్టీఆర్‌ కథను లక్ష్మీపార్వతి యాంగిల్‌లో చెప్పాలని మీకు ఎందుకు అనిపించింది? ఆమె మీద ఉన్న అభిమానమా?. వర్మ: నాకు లక్ష్మీపార్వతిగారి మీద ఎలాంటి ఇంప్రెషన్‌ లేదు. ఇలా చెప్పడానికి ముఖ్యకారణం ఏంటంటే ఎన్టీఆర్‌గారు మహా మహా అందగత్తెలతో నటించారు. అలాంటి ఆయనకు ఈవిడ ఎక్కడ దొరికారా? ఇంకో డౌట్‌ ఏంటంటే ఎన్టీఆర్‌గారు ఆ అందగత్తెలను పెళ్లి చేసుకోకుండా ఈవిణ్ణి చేసుకోవడమేంటి? అలా లక్ష్మీపార్వతిగారి మీద నా ఫీలింగ్‌ నెగటివ్‌ ఇంప్రెషన్‌తో స్టార్ట్‌ అయింది. పొలిటికల్‌గా కూడా ఆవిడ్ని పెద్దగా ఫాలో అవ్వలేదు. కానీ ఎన్టీఆర్‌ పెద్ద స్టార్‌గా మనందరికీ తెలుసు. ఆయన మాట్లాడే విధానం మనకు తెలుసు.
తిత్లీ బాధిత గ్రామాన్ని దత్తత తీసుకోనున్న చెర్రీ
ఏపీలో తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. తుపాను ప్రభావంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పెద్ద మొత్తంలో సంభవించింది. తిత్లీ తుపాను బాధితులకు సహాయంగా ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు ఆపద సమయంలో తమ వంతు సహాయాన్ని అందిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. అయితే తాజాగా మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఈ విపత్తు పై స్పందించారు. తుపాను బాధిత ప్రాంతాల్లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తానని తెలిపాడు.
లక్ష్మీస్ ఎన్టీఆరే అసలైన బయోపిక్‌: లక్ష్మీ పార్వతి
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమానే అసలైన బయోపిక్‌ అంటున్నారు ఎన్టీఆర్‌ సతీమణి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్‌ నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఎలా లాక్కున్నారో ఈ సినిమా ద్వారా తెలుస్తోందని ఆమె అన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో వాస్తవాలు బయటకురావడం ఖాయమన్నారు. టీడీపీ నేతలకు ఎన్టీఆర్‌ మాటలు వినాలంటే భయంపట్టుకుందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎలాంటి భయం లేకుండా ఎన్టీఆర్‌ ఎలా మరణించారో ప్రజలకు చూపిస్తారని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. చంద్రబాబు మోసానికి వ్యతిరేకంగా ప‍్రజలు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుజయ్‌ కృష్ణ రంగారావు పార్టీ మారినా తమకేమీ చేయలేదని మహిళలే చీదరించుకుంటున్నారన్నారు.
రీమేక్‌ మీద కన్నేసిన బన్నీ..!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్‌ తిన్న అల్లు అర్జున్‌ కొత్త సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌ అయి చాలా రోజులు అవుతున్నా బన్నీ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. తమిళ దర్శకుడు లింగుసామితో ఒక సినిమా, విక్రమ్‌ కుమార్‌తో మరో సినిమా చర్చల దశలో ఉన్న ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా అల్లు అర్జున్‌ ఓ రీమేక్‌ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లో రిలీజ్‌ అయిన సోను కే టిటు కీ స్వీటీ సినిమాను బన్నీ తెలుగులో చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
వర్మను భయపెట్టే విషయం ఏంటంటే..!
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. ఇటీవల తిరుమల వేదికగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను ప్రారంభించిన వర్మ సినీ రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈ సినిమా సందర్భంగా మీడియాకు వరుస ఇంటర్య్వూలు ఇస్తూ సినిమాకు వీలైనంత ప్రచారం తీసుకొచ్చే పనిలో ఉన్నారు. తాజాగా ఓ మీడియా ఇంటర్య్వూలో మాట్లాడిన వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవుడు, సమాజం, బంధాలు లాంటి ఏ విషయానికి తాను భయపడనని చెప్పే వర్మ తనకు భయం కలిగించే విషయమేంటో బయటపెట్టాడు. తనకు మంచానికే పరిమితమై మరో వ్యక్తి మీద ఆధారపడి జీవించటం అన్నా. ముసలితనం అన్న భయమని తెలిపారు. ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా జనవరి 24న రిలీజ్‌ కానుంది.
యాసిడ్‌ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు
"ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు" అని గాయని చిన్మయి వాపోయారు. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై కొందరు స్త్రీలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను చిన్మయి ట్వీటర్‌ ద్వారా బయటపెట్టిన విషయం తెలిసిందే. చిన్మయి శనివారం చెన్నై పత్రికా సంఘం కార్యాలయంలో తమిళనాడు సినీ పరిశ్రమ పరిరక్షణ సమాఖ్య తరఫున ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ - లైంగిక వేధింపుల గురించి 2013లో నేను ట్వీటర్‌లో పేర్కొన్నప్పుడు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు కూడా నాపై యాసిడ్‌ పోస్తామంటూ హత్యా బెదిరింపులు వస్తున్నాయి. అదే విధంగా గత వారం రోజులుగా ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనను అప్పుడే బయటపెట్టకుండా ఇప్పుడెందుకు చెబుతున్నావని ప్రశ్నిస్తున్నారు. లైంగిక వేధింపుల వ్యవహారం పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించి ఉండవచ్చు.
వాడిని సమాధి చేయాలనుకున్నా
బాలీవుడ్‌ సెలబ్రిటీ మ్యానేజ్‌మెంట్‌ ఏజెన్సీ 'క్వాన్‌' ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ వ్యవస్థాపకుడు అనిర్భన్‌ బ్లా మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను తన పదవిలో నుంచి తప్పుకోమన్నారు కంపెనీ ప్రతినిధులు. అయితే ఎవరూ ఊహించని విధంగా అనిర్భన్‌ ఆత్మహత్యా యత్నం చేశారు. ముంబైలోని వర్షి బ్రిడ్జ్‌ దగ్గర ఈ చర్యకు పాల్పడుతుండగా పోలీసులు కాపాడారు. ఇది జరగక ముందే తన ఆత్మహత్య నోట్‌ను అనిర్భన్‌ ఓ పత్రికకు పంపారట. నేను చేసిన పనులను సమర్థించుకోవడం కాదు. కానీ నా జీవితం మొత్తం మంచి వ్యక్తిగా ఉండే ప్రయత్నం చేశాను. అయితే నా బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల రాక్షసుడిగా మారానేమో. ద్వంద్వ వైఖరితో ప్రవర్తించి ఉండొచ్చు.
హిట్‌ కాంబినేషన్‌ సెట్‌
ఒకరు స్టైలిష్‌ స్టార్‌ అయితే మరొకరు మాటల మాంత్రికుడు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే అభిమానులకు పండగే పండగ. 'జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి' సినిమాలతో హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలనే నమోదు చేశారు. మరో సూపర్‌ హిట్‌ ఇవ్వడానికి ఇద్దరూ రెడీ అయ్యారని సమాచారం. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమా గురించి క్లారిటీ రాలేదు. పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ఫైనలైజ్‌ అయిందని టాక్‌. అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ మూడో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
అర్జున్‌ నన్ను వేధించారు
'మీటూ' ఉద్యమం సౌత్‌లోనూ ప్రకంపనలు సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 'మీటూ' ఉద్యమానికి చాలా మంది సౌత్‌ కథానాయికలు మద్దతు తెలిపారు. ఇటీవల కన్నడ నటి సంగీతా బాత్‌ తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. తాజాగా కన్నడ నటి శ్రుతీ హరిహరన్‌ కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం 'నిబుణన్‌' సెట్స్‌లో (కన్నడలో 'విస్మయ') నటుడు అర్జున్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. నా లైఫ్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి చాలా చేదు అనుభవాలనే ఎదుర్కొన్నాను. ఎన్నో ఆశలతో నా సినిమా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాను. నా కలలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీ నాకు సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఇలా చెప్పడానికి బాధగా ఉంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ సంకేతాలు నాకు కనిపించాయి.
థ్రిల్‌ అండ్‌ ఫన్‌
'అర్జున్‌రెడ్డి' చిత్రంతో ఒక్కసారిగా బాక్సాఫీస్‌ దగ్గర బంపర్‌ హిట్‌ సాధించారు హీరో విజయ్‌ దేవరకొండ. 'గీత గోవిందం' చిత్రం ఆ ఫీట్‌ను కంటిన్యూ చేసింది. ఇదే ఫీట్‌ను 'టాక్సీవాలా' చిత్రంతో రిపీట్‌ చేయటానికి రెడీ అయ్యారు విజయ్‌. జిఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాహుల్‌ సంకృత్యాన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ, ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్‌ 16న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అని చిత్రబృందం తెలిపింది.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this