facebook pixel
chevron_right Politics
transparent
ధర్మసాగరం సెజ్‌ ఎంతమందికి ఉద్యోగాలిచ్చింది : వైఎస్‌ జగన్‌
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అయ్యన్నపాత్రుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచారని అన్నారు. ధర్మసాగరం ప్రాంతంలో సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి) ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పిస్తానన్న బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. నర్సీపట్నంను అభివృద్ధి చేసి మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతానన్న హామీని టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని చెప్పారు. నీరుచెట్టు కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలోని చెరువుల్లో పూడిక తీసి మట్టిని అమ్ముకుంటున్నారని విమర్శించారు.
కేరళ విపత్తు హృదయాన్ని కలిచివేస్తోంది : వైఎస్‌ జగన్‌
భారీ వరదలు, ఎడతెగని వర్షాలతో ఛిన్నాభిన్నమైన కేరళ పరిస్థితిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వరద విపత్తు హృదయాన్ని కలిచివేస్తోందని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ కష్టకాలంలో తన ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయని అన్నారు. విపత్తుతో తల్లిడిల్లుతున్న కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కేరళ విపత్తులో ఇప్పటివరకు 324మంది చనిపోయారు. మూడు లక్షలమందిని సహాయక శిబిరాలకు తరలించారు. గత వందేళ్లలో ఎన్నడూలేనివిధంగా భారీ వరదలు ముంచెత్తడంతో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది.
కాంగ్రెస్‌ ముఖ్యులతో ముగిసిన రాహుల్‌గాంధీ సమావేశం
కాంగ్రెస్‌ వార్‌ రూంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లతో పాటు ముఖ్య నేతలు అశోక్‌ గెహ్లాట్‌, గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మతో సహా కీలక నేతలు హాజరయ్యారు. రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేరళ ప్రజలను ఆదుకోవడంపై కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ గాంధీ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి హాజరైన ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడుతూ. రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్లలో జరిగిన అవినీతి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రఫెల్‌ కుంభకోణంలో మోదీ పెద్ద దోషి అని, ఆయనే ప్రధాన దోపిడీదారుడని విమర్శించారు.
కేరళ వరదలు.. మోదీకి రాహుల్‌ ట్వీట్‌
కేరళ వరదలను వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ట్విటర్‌ లో 'ప్రియమైన ప్రధాని మోదీ గారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. లక్షలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధి, భవిష్యత్‌ మీ చేతిలో ఉంది' అని ట్వీట్‌ చేశారు. అంతకు ముందు కేరళ సహాయక చర్యల్లో పాల్గొనాలని, తమకు తోచిన సాయం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు శనివారం కేరళ వచ్చిన మోదీ రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వరద పరిస్థితిని ఏరియల్‌ సర్వే ద్వారా సమీక్షించిన మోదీ.
తరగతి గదిలో దస్తూరి తిలకం
గ్వాలియర్‌లో వాజ్‌పేయి చదువుకున్న పాఠశాల ఆయన జ్ఞాపకాల్లో తడిసిముద్దవుతోంది. ఆయన చేతిరాతతో ఉన్న రిజిస్టర్‌ తమకు పెన్నిధి అంటూ గర్వంగా చెప్పుకుంటోంది. కృష్ణాదేవి, కృష్ణ బిహారి వాజ్‌పేయి దంపతులకు 1924 సంవత్సరం క్రిస్మస్‌ పర్వదినం రోజు జన్మించిన అటల్‌ బిహారి వాజ్‌పేయి గోరఖి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఆ పాఠశాలకు వాజ్‌పేయి తండ్రే ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. వాజ్‌పేయి స్కూలు రిజిస్టర్‌లో తన స్వదస్తూరితో పేరును రాసుకున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, వాజ్‌పేయి చేతిరాత ఉన్న రిజిస్టర్‌ మాత్రం పదిలంగా ఉంది. 'ఈ రిజిస్టర్‌ మాకో నిధిలాంటిది. నెంబర్‌ 101 దగ్గర ఉన్న పేరు వాజ్‌పేయిదే. 1935లో ఆరో తరగతిలో చేరడానికి వచ్చినప్పుడు వాజపేయి స్వయంగా తన పేరుని రాసుకున్నారు.
ఆ పలకరింపు మరువలేం...
లోక్‌సభ సభ్యుడిగా తాను ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన లక్నో అంటే మాజీ ప్రధాని వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధముంది. లక్నోకే ప్రతిష్టాత్మకంగా మారిన 24 కి.మీ ఔటర్‌రింగ్‌రోడ్డు లాంటి 'పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌ హై'ను అక్కడివారు గుర్తుచేసుకుంటున్నారు. అమరుల మార్గం (షహీద్‌ పథ్‌) పేరుతో నిర్మించిన ఈ రోడ్డు ఇప్పుడు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. 'షహీద్‌ పథ్‌ అనేది లక్నోకు వాజ్‌పేయికి ప్రత్యక్షంగా ఇచ్చిన పెద్ద బహుమతి. దేశవ్యాప్తంగానూ స్వర్ణ చతుర్భుజిని నిర్మించింది ఆయనే. అంతకుముందు లక్నోలో ఒకసారి, ఢిల్లీలో మరోసారి తాను వాజ్‌పేయిని కలుసుకోవడం మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని రతన్‌కుమార్‌ అనే వ్యాపారవేత్త చెప్పారు. ఎప్పుడు కలిసినా ఆత్మీయంగా పలకరించడంతో పాటు, ఏ సమస్య మీద అయినా ఆయనను సులభంగా కలుసుకునేందుకు వీలుండేదని ఆ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
మహానేతకు సేవ చేయడం మా అదృష్టం...
దేశవ్యాప్తంగా తన వాక్పటిమ, రాజనీతిజ్ఞతతో ఆకట్టుకున్న మహానేతకు వారు సేవలందించారు. వాజ్‌పేయికి అంతమ శ్వాసవరకు సేవ చేసే అవకాశం లభించడాన్ని ఢిల్లీలోని ఆల్‌ఇండియా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏయిమ్స్‌) డాక్టర్లు, నర్సులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఏయిమ్స్‌లో వాజ్‌పేయికి 9 వారాల పాటు చికిత్స అందించిన సందర్భంగా తమకెదురైన జ్థాపకాలను వారు పదిలం చేసుకుంటున్నారు. వృద్ధాప్యంతో పాటు న్యూమోనియా, వివిధ అవయవాలు పనిచేయని కారణంగా గురువారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. వాజ్‌పేయి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో గత కొన్నిరోజులుగా తాము తీవ్ర వత్తిడిలో పనిచేయాల్సి వచ్చిందని, అయినా అలాంటి నేతకు సేవలు చేయడంలో ఆ శ్రమ మరిచిపోయామని చెబుతున్నారు.
ప్రముఖుల తుది మజిలీ 'స్మృతి స్థల్‌'
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు దేశ రాజధాని ఢిల్లీలోని స్మృతి స్థల్‌లో జరిగాయి. యమునా నది తీరంలో పచ్చిక బయలుతో అలరారే సువిశాల ప్రాంగణం స్మృతి స్థల్‌. గాంధీ సమాధి(రాజ్‌ఘాట్‌)కి సమీపంలో శాంతివన్‌ (నెహ్రూ సమాధి), విజయ్‌ ఘాట్‌ (లాల్‌ బహదూర్‌ శాస్త్రి సమాధి)ల మధ్య ఈ స్మృతి వనం ఉంది. రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధాన మంత్రుల వంటి అత్యంత ప్రముఖుల అంత్యక్రియల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్మృతి స్థల్‌ను ఏర్పాటు చేసింది. గతంలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు మరణించినప్పుడు వారికోసం దేశ రాజధానిలో ప్రత్యేకంగా స్థలాల కేటాయింపులు జరిగాయి. రాజ్‌ఘాట్‌ సమీపంలో వారికి కూడా స్మారక స్థలాలను కేటాయించేవారు.
భారతీయుల గుండెల్లో ఉంటారు
మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయికి ప్రధాని నరేంద్ర మోదీ కన్నీటి వీడ్కోలు తెలిపారు. వాజ్‌పేయి వంటి అసాధారణ వ్యక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారని ఆయన పేర్కొన్నారు. 'దేశాన్ని మహోన్నతంగా మార్చడంలో జీవితాన్నే త్యాగం చేసిన వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు సరైన పదాలే లేవు. నేడు దేశం నలుమూలల నుంచి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ అరుదైన వ్యక్తికి నివాళులర్పించేందుకు ఢిల్లీ వచ్చారు. అటల్‌ జీ దేశం మీకు సెల్యూట్‌ చేస్తోంది' అని మోదీ ట్వీట్‌ చేశారు. ఉదయం తన బ్లాగ్‌లోనూ 'స్ఫూర్తి, సుహృద్భావం, అద్భుతమైన వాక్చాతుర్యం కలబోసిన మహనీయుడిని దేశం నేతగా ఎంచుకుంది.
పొన్నం క్షమాపణ చెప్పాలి: గంగుల
మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌ నాయకులు బొందల గడ్డగా మార్చిన కరీంనగర్‌ను కేటీఆర్‌ అభివృద్ధి చేశాడని తెలిపారు. తెలంగాణ సాధించుకోవాలనే లక్ష్యంతోనే కేటీఆర్‌ అమెరికా వదిలిపెట్టి వచ్చాడని, ఆయనను విమర్శించే నైతిక హక్కు పొన్నం ప్రభాకర్‌కు లేదన్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కోసమే పొన్నం నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సీఎం ఎసరు: చాడ
కేసీఆర్‌ ఇందిరమ్మ ఇళ్లకు ఎసరుపెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా 4.66 లక్షల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం రామంచలో విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని భావించిన ప్రభుత్వం. సీబీసీఐడీతో విచారణ జరిపించి ఎందుకు మరుగున పెట్టిందని ప్రశ్నించారు. డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు ఎక్కడా నిర్మించడం లేదన్నారు. రామచంద్రం, హుస్నాబాద్‌ ఎమ్మె ల్యే వొడితెల సతీష్‌కుమార్‌ పదినెలల క్రితం డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారని, ఇంకా ప్రారంభంకాలేదని పేర్కొన్నారు.
'నాయిని' తూటాలు లేని తుపాకీ: పొన్నం
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తూటాలు లేని తుపాకీ లాంటివాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే కంటి పరీక్షలు చేయించుకో? అనే నాయిని వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. 'మా కళ్లు బాగానే ఉన్నాయి. మీరే మెదడు పరీక్ష చేయించుకోవాలి'అని హితవు పలికారు. మంత్రి కేటీఆర్‌ అసహనంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేవుడికి ఇచ్చిన హామీని కూడా విస్మరించడంలో కేసీఆర్‌కు మించినోడు లేడని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌ పని ఖతం ఎమ్మెల్యే వివేకానంద
తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ పర్యటనతో ఊపు వచ్చిందని కాంగ్రెస్‌ నాయకులు ఊహల్లో ఉన్నారని అన్నారు. రాహుల్‌గాంధీ ఇక్కడే అడ్డా వేసినా. టీఆర్‌ఎస్‌ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. రాహుల్‌గాంధీ సభావేదికపై ఉన్న నాయకులంతా ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నాయకులకు కామన్‌ ఎజెండా లేదని విమర్శించారు. ఒక నాయకుడు ఎన్నికలకు సిద్ధమంటే, మరొకరు ఇప్పుడే ఎందుకు ఎన్నికలు అంటున్నారని పేర్కొన్నారు. ఏ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం, సఖ్యత లేదన్నారు. అసెంబ్లీలో మాట్లాడటానికి సమస్యలు, అంశాలు ఏమీ లేక సభ నుంచి కాంగ్రెస్‌ నేతలు పారిపోతున్నారని విమర్శించారు.
'హోదా' ఎవరిస్తే వారికే మా మద్దతు
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్నికల్లో పూర్తి మెజారిటీనే కట్టబెడతారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో విజయంపై మాకు ఎలాంటి ఢోకా లేదు. చంద్రబాబు ప్రభుత్వంపై అసమ్మతి తారస్థాయిలో ఉన్నందున్న వైఎస్సార్‌ సీపీకి 2019 ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చే ప్రశ్నేలేదు. తొమ్మిదేళ్ల పాలనానుభవం కలిగినప్పటికీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ప్రజలకు ఏమీ చేయని ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను పూర్తిగా మార్చివేయబోతున్నాం. ప్రధానమంత్రి మోదీనా లేక రాహుల్‌ గాంధీనా అనేది ముఖ్యం కాదు. ప్రత్యేక హోదాను ఎవరు ఇస్తే వారినే బలపరుస్తాం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదానే ప్రాణాధారం. 2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో మీ విజయావకాశాలపై మీ అంచనా ఏమిటి?. 2014 ఎన్నికల నాటికి చంద్రబాబు అధికారంలో లేడు కనుక ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆయనపై ఉండే అవకాశం లేదు.
ఒక్క క్లిక్‌తో నేటి వార్తా స్రవంతి
భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి 'మరణమా నా కెందుకు భయమంటూ' దివికేగారు. ఇక సెలవంటూ యమునా నది తీరంలోని స్మృతి స్థల్‌లో సేద తీరారు. అశేష జనవాహిని, ప్రియాతి ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య అటల్‌జీ అంతిమసంస్కారాలు ముగిశాయి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి) ఇక సెలవంటూ సేదతీరిన కర్మయోగి. 167కు చేరిన కేరళ వరద మృతులు. ఆయన శాంతికోసం కృషి చేశారు: ఇమ్రాన్‌ ఖాన్. మహిళా క్రికెట్‌లో ఓ అ‍ద్భుతం. (వార్తాల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయడి).
'వాజ్‌​పేయి ఆరోగ్య శ్రీ' జిందాబాద్‌
మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టినందుకో, మరెందుకోగానీ కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రంలోని 'వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ' పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పేదల పెన్నిదిగా ఈ పథకం సవ్యంగా అమలు జరుగుతోంది. 2010లో అప్పటి బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇది వేలాదిమంది పేద ప్రజలకు ప్రాణభిక్ష పెట్టింది. కర్ణాటక పేద ప్రజలను ఎక్కువగా పీడిస్తున్న క్యాన్సర్, గుండె జబ్బుల వైద్యం కోసం ఇల్లూ వాకిలి అమ్ముకునే పరిస్థితి నుంచి వారిని కాపాడుతూ వస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్‌) పేద ప్రజలందరికి ఈ స్కీమ్‌ కింద ఉచితంగా వైద్య సేవలు బేషుగ్గా అందుతున్నాయి.
భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ టెండర్‌ వెనుక భారీ కుట్ర!
భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ టెండర్‌ వెనుక భారీ దోపిడీకి కుట్ర జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటనను ట్వీట్‌ చేశారు. భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ టెండర్‌లో పాల్గొనకుండా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిషేదించారని పేర్కొన్నారు. కేవలం ప్రైవేట్‌ సంస్థలను మాత్రమే టెండర్‌కు అర్హులను చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక భారీ దోపిడీకి పథక రచన జరిగిందని ఆరోపించారు. గతంలో ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఈ టెండర్‌ను దక్కించుకోవడంతో కుంటి సాకులు చూపుతూ సీఎం చంద్రబాబు దానిని రద్దు చేశారన్నారు. తాజాగా జారీ చేసిన టెండర్‌లో అసలు ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ పాల్గొనకుండా నిషేదించడం సరైన చర్యనేనా అని ప్రశ్నించారు.
ఆయనే నాకు మార్గనిర్దేశి: అఖిలేశ్‌
భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతితో యావత్‌ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికే దేశవిదేశాల నుంచి నేతలు, అభిమానులు తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ఢిల్లీకి తరలివచ్చారు. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ వాజ్‌పేయితో కలిసిఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. 1999లో అఖిలేష్‌-డింపుల్‌ వివాహానికి హాజరైన వాజ్‌పేయి ఫోటోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 'అటల్‌ బిహారి వాజ్‌పేయి రాజకీయాలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన మహానేత, పార్టీ సిద్దాంతాలను పాటిస్తూనే వ్యక్తిత్వాన్ని మరిచిపోని గొప్పనేత వాజ్‌పేయి. ఆయన మాలాంటి ఎంతో మంది యువ రాజకీయ నాయకులకు మార్గనిర్దేశి. ఆయన మరణంతో ప్రపంచం గొప్ప నాయకున్ని, రచయితను, గొప్ప వక్తను కోల్పోయాం.
వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 239వ రోజు షెడ్యూల్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 239వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం నుంచి పాదయాత్ర ప్రారంభమౌతుంది. నర్సీపట్నంలోని మెట్టపాలెం క్రాస్‌ రోడ్డు, బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్‌ వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం నర్సీపట్నం టౌన్‌లోని కృష్ణాపురం, దుగ్ధ క్రాస్‌ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత లంచ్‌ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పున: ప్రారంభమౌతుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.
20 లక్షల ఉద్యోగాలన్నారు.. ఏమైంది?
ప్రజా సమస్యలపై ఆంధ్రప‍్రదేశ్‌ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవేదన వ‍్యక్తం చేశారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో వైఎస్‌ జగన్‌. ఏపీ ప‍్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై జగన్‌ ప్రశ్నించారు. రైతుల రుణ మాఫీతో పాటు, రూ, 20 లక్షల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాని జగన్‌ నిలదీశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబును బీజేపీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లే తప్పుబడుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this