facebook pixel
chevron_right Sports
transparent
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రవీణ్ కుమార్
'భారమైన హృదయంతో గుడ్‌బై చెప్తున్నా' అంటూ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు భారత సీమర్ ప్రవీణ్‌ కుమార్‌ శనివారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 11 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ట్విటర్ వేదికగా అభిమానులకు వీడ్కోలు సందేశం పంపించాడు. నా తొలిప్రేమకు భారమైన హృదయంతో వీడ్కోలు చెప్తున్నా. కానీ, భారత్ క్రికెట్‌ ఉన్నంత కాలం టెస్టుల్లో 268 నంబర్‌, వన్డేల్లో 170 నంబర్ నాతోనే ఉంటుంది. నా కలను నిజం చేసుకోవడానికి సహకరించిన బీసీసీఐ, యూపీసీఏకు కృతజ్ఞతలు' అని ట్వీట్ చేయడంతో పాటు 'క్రికెట్ మేరీజాన్' అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. జయపుర‌లో 2007లో పాకిస్థాన్‌తో జరిగిన‌ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ప్రవీణ్ 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అలాగే కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు.
ఫేక్‌ యాక్టింగ్‌.. ఫేక్‌ అవార్డు
ఏ విషయమైనా ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకోవడం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అలవాటు. ఒక్కోసారి ఆటపట్టించేలా కూడా పోస్టులు చేస్తుంటాడు. ఇలాగే తాను ఓ సినిమాలో నటిస్తున్నట్లు గత నెలలో కోహ్లీ ట్విటర్‌లో ఓ పోస్టు చేశాడు. దాని పేరు ట్రైలర్‌ అని, నిర్మాత వ్రాన్‌ ప్రొడక్షన్స్‌ అని. తన స్టిల్‌ ఉన్న ఓ పోస్టర్‌ను గత నెల 20న ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన అభిమానులంతా అవాక్కయ్యారు. కోహ్లి నిజంగా సినిమాలో నటిస్తున్నాడా అని ఆశ్చర్యపోయారు. అయితే 'ఈ ఫేక్‌ సినిమాకు ఇప్పుడు నకిలీ ఆస్కార్‌ గెలిచాను' అని ఆటపట్టిస్తూ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.'నేను నటించని ట్రైలర్‌ సినిమాకు వచ్చిన నకిలీ ఆస్కార్‌ ఇది.
ఇక వింబుల్డన్‌లో చివరి సెట్‌లో టైబ్రేక్‌లు
ఇకపై వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో సుదీర్ఘ మ్యాచ్‌లకు చెల్లుచీటి పడనుంది. మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చే చివరి సెట్‌లో స్కోరు 12-12 వచ్చాక టైబ్రేక్‌ను ఆడించేందుకు ఆల్‌ ఇంగ్లండ్‌ లాన్‌ టెన్నిస్‌ క్లబ్‌ సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ఈ టైబ్రేక్‌ ఆట మొదలవుతుందని క్లబ్‌ చైర్మన్‌ ఫిలిప్‌ బ్రూక్‌ వెల్లడించారు. 'టైబ్రేక్స్‌ పద్ధతిని ప్రవేశపెట్టే సమయం వచ్చింది. మ్యాచ్‌లకు ఇకపై అసాధారణ ముగింపుల్లేకుండా, నిర్ణీత సమయంలోనే పోటీలు ముగిసేందుకు ఈ టైబ్రేక్స్‌ దోహదపడతాయి' అని ఆయన అన్నారు. ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌ జరుగుతుండగా. ఒక్క యూఎస్‌ ఓపెన్‌లోనే మ్యాచ్‌ చివరి సెట్‌లో టైబ్రేక్స్‌ను నిర్వహిస్తున్నారు.
గోల్‌కీపర్‌ ఆకాశ్‌ చిక్టేపై రెండేళ్ల నిషేధం
నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న భారత క్రీడాకారులపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) సస్పెన్షన్‌ వేటు వేసింది. భారత హాకీ గోల్‌ కీపర్‌ ఆకాశ్‌ చిక్టేపై రెండేళ్లు, రెజ్లర్‌ అమిత్, కబడ్డీ ప్లేయర్‌ ప్రదీప్‌ కుమార్, వెయిట్‌లిఫ్టర్‌ నారాయణ్‌ సింగ్, అథ్లెట్స్‌ సౌరభ్‌ సింగ్, బల్జీత్‌ కౌర్, సిమర్జిత్‌ కౌర్‌లపై నాలుగేళ్ల నిషేధం విధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో నిర్వహించిన శిక్షణ శిబిరం సందర్భంగా చిక్టే రక్త,మూత్ర నమూనాల్ని పరీక్షించారు. ఇందులో నిషిద్ధ ఉత్ప్రేరకాలైన అనబాలిక్‌ స్టెరాయిడ్‌ తీసుకున్నట్లు తేలింది. అయితే అతను కావాలని దీన్ని తీసుకోలేదని కాలికి దెబ్బతగలడంతో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో మెడిసిన్‌ ద్వారా తీసుకున్నట్లు చెప్పారు. దీంతో అతనికి కేవలం రెండేళ్ల నిషేధంతోనే సరిపెట్టగా.
తెలుగు టైటాన్స్‌కు మూడో గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 35-31తో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్‌ 14-17తో వెనుకబడింది. రెండో సగంలో స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి చెలరేగడంతో టైటాన్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా. తెలుగు టైటాన్స్‌ 30-31తో వెనుకంజలో ఉంది. ఆ సమయంలో రైడింగ్‌కు వచ్చిన పట్నా కెప్టెన్‌ ప్రదీప్‌ నర్వాల్‌ను టైటాన్స్‌ ఆటగాళ్లు పట్టేయడంతో 32-31 తో నిలిచింది. ఇక అక్కడి నుంచి ఆధిక్యాన్ని కాపాడు కుంటూ జాగ్రత్తగా ఆడి విజయం సొంతం చేసుకుంది.
భారీ విజయంతో బోణీ
డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన భారత్‌ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టింది. ఆతిథ్య ఒమన్‌తో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో 'ఢీ'కొనేందుకు సిద్ధమైంది. మస్కట్‌: యువ ఆటగాడు దిల్‌ప్రీత్‌ సింగ్‌ 'హ్యాట్రిక్‌' సాధించడంతో. ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఒమన్‌ జట్టుతో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 11-0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున దిల్‌ప్రీత్‌ సింగ్‌ (41వ, 55వ, 57వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చేయగా.
ఆకలే... ఆటలో దించింది!
బుక్కెడు బువ్వ పెడతామంటే బంతులేసేందుకు సిద్ధపడ్డాడు. ఈ ఆట క్రికెట్‌ అని, తను చేసే పని బౌలింగ్‌ అని తెలియని వయసది. అయితే కాలంతో పాటు అతని దశ తిరిగింది. నా అనే వాళ్లెవరూ లేని రోజుల నుంచి. భారత 'సి' జట్టులోని 11 మందిలో ఒకడయ్యే దాకా ఎదిగాడు. ఇది స్పిన్నర్‌ పప్పు రాయ్‌ విజయ గాథ. గువాహటి: ఒడిశా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ పప్పు రాయ్‌ పేదవాడే కాదు. ఎవరూ లేనివాడు కూడా! అతనిది దీనగాథ కాదు. కన్నీటిగాథ! బీహార్‌కు చెందిన ఇతని తల్లిదండ్రులు అతని పసిప్రాయంలోనే కన్నుమూశారు. 'అమ్మ నాన్న' అని మాటలు నేర్వకముందే వాళ్లను కోల్పోయాడు. అయితే తన తండ్రి జందార్‌ రాయ్, తల్లి పార్వతి దేవి అని.
వికెట్‌కు 10 రూపాయలు!
బీహార్ రాష్ట్రం సరన్ జిల్లాకు 41కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖజురీ గ్రామం పప్పు రాయ్ జన్మస్థలం. పసితనంలోనే తండ్రి జమ్‌దార్ రాయ్. గుండెపోటుతో మరణించగా, తల్లి పార్వతి దేవి దీర్ఘకాల అనారోగ్యంతో అసువులు బాసింది. కనీసం అమ్మ, నాన్న ఎవరో తెలియని వయసులో అత్త,మామ అతని ఆలనాపాలనా చూసుకున్నారు. పొట్టకూటి కోసం కోల్‌కతా నగరానికి వలసవచ్చిన ఒక్క విషయం తప్పా. తనకు ఏం తెలియదంటున్నాడు రాయ్. తనను పెంచి పెద్దచేసిన మామ కూడా చనిపోవడం పప్పు కష్టాలను అంతకంతకు పెంచింది. కానీ క్రికెట్ అతని కష్టాల కన్నీళ్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది. కోల్‌కతాలోని పిక్నిక్ గార్డెన్ సమీపంలో కిరాయికి ఉండే రాయ్. పొట్టకూటి కోసం క్రికెట్‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. అప్పటివరకు కడుపుమాడ్చుకుని రోజులు వెళ్లదీసిన రాయ్‌ను సీనియర్లు ప్రోత్సహించారు.
అతడు మరో సెహ్వాగ్
ఒకప్పుడు భారత టెస్ట్ జట్టును పరుగులు పెట్టించిన ఆటగాడు సెహ్వాగ్. అతని తర్వాత ఆ స్థాయిలో దూకుడుగానీ, హిట్టింగ్‌గానీ చేసిన బ్యాట్స్‌మన్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. చాలా మంది బ్యాట్స్‌మెన్ వచ్చినా. కానీ వీరూ మాత్రం పరిస్థితులు ఎలా ఉన్నా. బౌలర్లు ఎంత మేటి అయినా బ్యాట్ ఝుళిపించాడంటే బంతి ఆకాశంలో ఎగురాల్సిందే. ఎన్నో సాహసోపేత ఇన్నింగ్స్‌లతో ఐదు రోజుల ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేసిన వీరూను తలపించేలా. ఇన్ని రోజుల తర్వాత భారత్‌కు పృథ్వీ షా రూపంలో మరో ప్రత్యామ్నాయం లభించింది. టెక్నిక్‌లోగానీ, స్పిన్నర్లను ఎదుర్కోవడంలోగానీ, బంతిని డిఫెన్స్ చేయడంలోగానీ అచ్చం వీరేంద్రుడిని తలపిస్తున్న ఈ ముంబైకర్. భారత భవిష్యత్ టెస్ట్ జట్టులో చాలా కీలకమని మాజీలు కుండబద్దలు కొడుతున్నారు.
భవిష్యత్ తారలు రెడీ!
యూత్ ఒలింపిక్స్‌లో యువ అథ్లెట్ల అద్భుత ప్రదర్శన న్యూఢిల్లీ: క్రీడల ప్రపంచంలో భారత్ ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది ముగిసిన ఆసియా క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు సాధించి రికార్డు నెలకొల్పగా. తాజాగా యూత్ ఒలింపిక్స్‌లోనూ భారత యువ అథ్లెట్లు అదరగొట్టారు. అర్జెంటీనాలోని బ్యూనస్‌ఎయిర్స్‌లో ముగిసిన యూత్ ఒలింపిక్స్‌లో భారత్ (3స్వర్ణ, 9 రజత,1కాంస్యం)13పతకాలతో అత్యధిక పతకాలు సాధించిన రికార్డును అందుకుంది. మిక్స్‌డ్ విభాగాల్లో 3 పతకాలను కలపకుండా వదిలివేసినా. భారత్ 2010లో సాధించిన అత్యధిక పతకాలు రికార్డు 8పతకాలను అధిగమించింది. మిక్స్‌డ్ ఈవెంట్లలో వేరే దేశాలకు చెందిన అథ్లెట్లతో కలిసి బరిలోకి దిగే అవకాశం ఉండడంతో ఈమేరకు గెలిచిన పతకాలను ఏ దేశం అకౌంట్‌లోనూ వేయడం లేదు.
భారత్ సమర సన్నాహం
టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన దూకుడులో ఉన్న భారత్. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం సర్వం సిద్ధమైంది. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థిని కట్టడిచేయాలన్న పట్టుదలతో ఉన్నది. ఈ నేపథ్యంలో తొలి వన్డేకు వేదికైన బార్సపర స్టేడియంలో శుక్రవారం టీమ్‌ఇండియా క్రికెటర్లు సమర సన్నాహం మొదలుపెట్టారు. కెప్టెన్ కోహ్లీకి తోడు ధోనీ, రాహుల్, ఉమేశ్‌యాదవ్, మహ్మద్ షమీ నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టి వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్‌పైనే అందరి కండ్లు ఉన్నాయి. దినేశ్ కార్తీక్ స్థానంలో జట్టుకు ఎంపికైన రిషబ్. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
క్వార్టర్‌ఫైనల్లో సైనా, శ్రీకాంత్
హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్‌లో అదరగొడుతున్నది. జపాన్ సంచలన షట్లర్ అకానె యమగుచితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో సైనా అదరగొట్టే ఆటతీరుతో విజయంతో క్వార్టర్‌ఫైనల్ చేరింది. ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడిన సైనా 23-21, 6-21, 22-20 స్కోరుతో ప్రపంచ నంబర్ 2ను ఓడించి అద్భుత విజయం సాధించింది. చివరిగేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకుని మరీ సైనా గెలుపును అందుకోవడం విశేషం. 2014లో చైనా ఓపెన్‌లో యమగుచిపై విజయం సాధించిన సైనాకు. నాలుగేండ్ల తర్వాత యమగుచిని ఓడించడం ఇదే తొలిసారి. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్. చైనా షట్లర్ లిన్‌డాన్‌ను చిత్తు చేశాడు. గురువారం రెండుసార్లు ఒలింపిక్ విజేత లిన్‌డాన్‌తో జరిగిన పోటీలో 18-21, 21-17, 21-16స్కోరుతో శ్రీకాంత్ ఓడించాడు.
టైటాన్స్ ఘన విజయం
ప్రొ కబడ్డీ లీగ్ ఆరోసీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు నిలకడగా ఆడుతున్నది. శుక్రవారం డిఫెండింగ్ చాంపియన్స్ పట్నా పైరేట్స్‌తో జరిగిన లీగ్‌మ్యాచ్‌లో 35-31 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ జట్టు ఉత్కంఠ విజయాన్ని సాధించింది. డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్, అబొజోర్ మిఘని రాణించడంతో పట్నా పైరేట్స్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. పట్నా రైడర్లు మంజీత్, విజయ్ కలిసి 16 రైడింగ్ పాయింట్లు సాధించినా విజయం సాధించడానికి ఈ ప్రతిభ సరిపోలేదు. తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 7 రైడింగ్ పాయింట్లతో రాణించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి 11-9 తేడాతో పట్నా ఆధిక్యంలోకి దూసుకెళ్లినా. రెండో అర్ధభాగంలో డిఫెన్స్‌తోపాటు రాహుల్ చౌదరి కీలక సమయంలో పాయింట్లు రాబట్టడంతో విజయం దక్కించుకుంది. టోర్నీలో పట్నాకు రెండో ఓటమి ఎదురుకాగా.
పాక్‌దే టెస్ట్ సిరీస్
ఆస్ట్రేలియాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 1-0తో దక్కించుకుంది. పాక్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్‌పై 373 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 538 పరుగుల లక్ష్యఛేదన కోసం 47/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆటకు దిగిన ఆసీస్. మహ్మద్ అబ్బాస్(5/62) ధాటికి 164 పరుగులకు కుప్పకూలింది. లాబుచ్చాంగ్నె(43), టిమ్ హెడ్(36) మినహా ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. అబ్బాస్‌కు తోడు యాసిర్ షా(3/45) విజృంభణతో కంగారూల బ్యాటింగ్ కుదేలైంది. ఏ దశలోనూ పోరాటపటిమ కనబరుచలేకపోయింది. కెప్టెన్ టిమ్ పెయిన్(0), మార్ష్ సోదరులు షాన్(4), మిచెల్(5) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అబ్బాస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు సిరీస్ దక్కింది.
'నేను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేశా'
పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్నాడు. 'నా పరిస్థితిని అర్థం చేసుకోవాలని క్రికెట్‌ బోర్డు, అభిమానులు, ప్రజలను కోరుకుంటున్నా. బుకీ అనుభట్‌ను కలిసి చాలా పెద్ద తప్పుచేశా. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయలేదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నా' అని కనేరియా మీడియాకు తెలిపాడు. 'ఆరేళ్ల నుంచి అబద్ధాలు చెబుతూ ఇప్పుడు నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అందుకే ఇప్పుడు నిజం చెబుతున్నా. స్ఫాట్‌ ఫిక్సర్‌ అని పిలిపించుకోలేను. ఇక ఎంత మాత్రమూ ఖండించనూ లేను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ప్రజలు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నా. ఈ కేసుకు సంబంధించి నా బ్యాంకు ఖాతాను ఇప్పటికే చాలా సార్లు తనిఖీ చేశారు.
నకిలీ సినిమాకు నకిలీ ఆస్కార్‌!
ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ విషయమైనా ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకోవడం విరాట్‌ కోహ్లీకి అలవాటు. ఒక్కోసారి ఆటపట్టించేలా కూడా పోస్టులు చేస్తుంటాడు. ఇలాగే తాను ఓ సినిమాలో నటిస్తున్నట్లు గత నెలలో కోహ్లీ ట్విటర్‌లో ఓ పోస్టు చేశాడు. దాని పేరు ట్రైలర్‌ అని, నిర్మాత వ్రాన్‌ ప్రొడక్షన్స్‌ అని. తన స్టిల్‌ ఉన్న ఓ పోస్టర్‌ను గత నెల 20న ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన అభిమానులంతా అవాక్కయ్యారు. కొహ్లీ నిజంగా సినిమాలో నటిస్తున్నాడా అని ఆశ్చర్యపోయారు. అయితే 'ఈ ఫేక్‌ సినిమాకు ఇప్పుడు నకిలీ ఆస్కార్‌ గెలిచా'నని ఆటపట్టిస్తూ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. నేను నటించని 'ట్రైలర్‌' సినిమాకు వచ్చిన నకిలీ ఆస్కార్‌ ఇది.
సైనా.. ఎన్నాళ్లకో సివంగిలా!
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ సంచలనం సృష్టించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారి తన ప్రియమైన ప్రత్యర్థి అకానె యమగూచి (జపాన్‌)ని ఓడించింది. డెన్మార్క్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆమె 21-15, 21-17తో వరుస గేముల్లో యమగూచిని చిత్తుచేసింది. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌ 3 నజోమి ఒకుహర (జపాన్‌)తో తలపడనుంది. ప్రస్తుతం యమగూచి ప్రపంచ రెండో ర్యాంకర్‌ కాగా సైనా 27వ ర్యాంకులో ఉంది. వీరిద్దరూ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తలపడగా ఆరు సార్లు యమగూచిదే విజయం. 2014లో చైనా ఓపెన్‌లో తొలిసారి యయగూచిని ఓడించిన సైనా మరో గెలుపు కోసం నాలుగేళ్లు ఎదురుచూసింది.
ఆ సత్తా కుల్దీప్‌లో ఉంది: భజ్జీ
టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప‍్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా ఆశాకిరణం కుల్దీప్‌ అంటూ కొనియాడాడు. భవిష్యత్తులో అతను నంబర్‌ వన్‌ స్పిన్నర్‌గా అవతరిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదని భజ్జీ ప్రశించాడు. ' భారత జట్టులో కుల్దీప్‌ యాదవ్‌ ఒక ప్రత్యేకమైన శైలితో దూసుకుపోతున్నాడు. టీమిండియాలో నంబర్‌ వన్‌ స్పిన్నర్‌గా అయ్యే సత్తా కుల్దీప్‌లో ఉంది. భవిష్యత్తులో భారత జట్టు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించడం ఖాయం. బంతిని రెండు వైపులా స్పిన్‌ చేయగల నైపుణ్యం కుల్దీప్‌లో ఉంది. బంతిని గాల్లోనే నెమ్మదిగా స్పిన్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపెట్టడంలో ఇప్పటికే కుల్దీప్‌ తనదైన మార్కును చూపడెతున్నాడు. టీమిండియా జట్టులో నంబర్‌ వన్‌గా స్పిన్నర్‌గా కుల్దీప్‌ నిలవడానికి ఎంతో సమయం పట్టదు.
ఇలాంటి రనౌట్‌ ఎప్పుడైనా చూశారా?
క్రికెట్‌లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లోకి చేరుకోలేకపోతే రనౌట్‌గా నిష్క్రమిస్తూ ఉంటారు. అయితే స్టైకర్‌-నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పూర్తిగా రిలాక్స్‌ అయిపోయి పిచ్‌ మధ్యలో ముచ్చట్లు పెట్టే క‍్రమంలో రనౌట్‌ కావడం ఎప్పుడైనా చూశారా. అయితే ఈ తరహా రనౌట్‌ తాజాగా చోటు చేసుకుం‍ది. ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య రెండో టెస్టు అబుదాబిలో జరుగుతోంది. గురువారం మూడో రోజు ఆటలో అజహర్‌ అలీ(64) విచిత్రంగా రనౌట్‌ అయ్యాడు. ఆసీస్‌ పేసర్‌ సిడెల్‌ వేసిన 53 ఓవర్‌ మూడో బంతిని అజహర్‌ అలీ థర్డ్‌ మ్యాన్‌ దిశగా షాట్‌ కొట్టాడు. అది కాస్తా బౌండరీ లైన్‌కు కాస్త దగ్గరగా వెళ్లి ఆగిపోయింది.
యామగూచికి సైనా షాక్‌
డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప‍్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక‍్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ 21-15, 21-17 తేడాతో ప్రపంచ రెండో ర్యాంక్‌ క్రీడాకారిణి యామగూచి(జపాన్‌)కి షాకిచ్చి క్వార్టర్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఈ రెండు గేమ్‌ల్లో తొలుత వెనుకబడ్డ సైనా నెహ్వాల్‌. కేవలం 36 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సుదీర్ఘమైన ర్యాలీలు, చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో ఆకట్టకున్న సైనా. ఎట్టకేలకు యామగూచికి బ్రేక్‌ వేశారు. దాదాపు నాలుగేళ్ల క్రితం చైనా ఓపెన్‌లో యమగూచిపై గెలిచిన సైనాకు ఆ తర్వాత ఇదే ఆమెపై తొలి విజయం. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇరువురి క్రీడాకారిణుల ముఖాముఖి రికార్డులో యామగూచి 6-1తో ఆధిక్యంలో ఉన్నారు.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this