facebook pixel
chevron_right Technology
transparent
నోకియా ఫోన్ల ధరలు తగ్గాయ్..!
భారత్‌లో మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న పలు నోకియా ఫోన్ల ధరలను ఆ ఫోన్ల తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ తగ్గించింది. రూ.1వేయి నుంచి రూ.1500 మేర పలు నోకియా ఫోన్ల ధరలు తగ్గాయి. నోకియా 3.1కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1వేయి తగ్గింది. దీంతో ఇప్పుడా ఫోన్ ధర రూ.11,999 నుంచి రూ.10,999కు తగ్గింది. అలాగే నోకియా 5.1 ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.1500 తగ్గడంతో ఇప్పుడా ఫోన్ రూ.12,999కు లభిస్తున్నది. నోకియా 6.1 ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల ధరలు వరుసగా రూ.1500, రూ.1వేయి తగ్గాయి.
మేట్ 20, మేట్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన హువావే
మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్లు మేట్ 20, మేట్ 20 ప్రొలను ఇటీవలే విడుదల చేసింది. మేట్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా, మేట్ 20 స్మార్ట్‌ఫోన్‌లో 6.53 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. రెండింటిలోనూ కైరిన్ 980 చిప్‌సెట్‌ను అమర్చారు. దీని వల్ల ఫోన్లు వేగవంతమైన ప్రదర్శనను ఇస్తాయి. రెండింటిలోనూ ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. మేట్ 20 ప్రొ లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయగా, ఈ ఫోన్‌లో 3డీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే 3డీ లైవ్ ఎమోజీ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.
అమృత్‌సర్‌ ప్రమాదం:సెల్ఫీల మోజులో పడి
సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని ఇప్పటికే అనేక సంఘటనలు రుజువు చేసాయి.ఒక్కోసారి ఈ సెల్ఫీ వ్యామోహం శృతిమించి ప్రాణాలమీదకు తెస్తోంది. తాజాగా రెండు రోజుల క్రితం పంజాబ్‌లో జరిగిన రైలు ప్రమాదం దాదాపు 60 మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరగాడానికి ముఖ్య కారణం ఒకటి రైల్వే ట్రాక్ పక్కన వేడుకలు నిర్వహించడమయితే మరొకటి వేడుక చూడ్డానికి వచ్చిన జనాలు వీడియోలు తీస్తూ సెల్ఫీలు దిగుతూ పరిసరాలను పట్టించుకోలేదు అంటున్నారు అక్కడి స్థానికులు. రూ.14,999 కడితే iPhone Xr మీ సొంతం. గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన లెనోవో కె9 స్మార్ట్‌ఫోన్
లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ కె9 ను ఇటీవలే విడుదల చేసింది. రూ.8,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా ప్రత్యేకంగా లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 5.7 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలను ఈ ఫోన్ కలిగి ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే వెనుక భాగంలో 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో అమర్చారు.
చందమామ 'మేడ్ ఇన్ చైనా'
విద్యుత్ ఆదా కోసం 2022 నాటికి కృతిమ చందమామలను తయారు చేసేందుకు చైనా ప్లాన్ చేస్తుంది. రాత్రి సమయాల్లో వీధి లైట్లకు బదులు ఈ కృతిమ చందమామలనే వాడాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. చంద్రుని కన్నా ఈ కృత్రిమ చందమామలు ఎనిమిది రెట్లు ఎక్కువగా వెలుతురును ప్రసరింపజేస్తాయి. అంతేగాక కృత్రిమ చంద్రులు నిజమైన చందమామలాగే ఉంటాయి. 2020 నాటికి కృత్రిమ చందమామల ప్రాజెక్టు పూర్తవుతుంది. వీటిని 2022నాటికి అంతరిక్షంలోకి పంపుతారు. శాంసంగ్ దీపావ‌ళి సేల్ :గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ S8 మరియు TVల ఫై భారీ తగ్గింపు గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
బీఎస్‌ఎన్‌ఎల్‌ దీపావళి ధమాకా ! ఇప్పుడు రోజు 2జిబి డేటా పొందండి
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ పండుగల సందర్బంగా తమ ప్రీపెయిడ్‌ వినియోగ దారుల కోసం మరో ఆకర్షణీయ ప్లాన్‌ను ఆవిష్కరించింది. రూ.78తో రీచార్జ్‌ చేసుకోవడం ద్వారా 10 రోజుల పాటు ప్రతీ రోజు అప‌రిమిత కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌, 2జిబి డేటా అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. అక్టోబర్ 15 నుంచి బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త ప్యాక్ యొక్క ప్రయోజనాలు వినియోగదారులకు అందుబాటులో ఉంది అక్టోబర్ 24న ప్రారంభం కానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్ గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
అక్టోబర్ 24న ప్రారంభం కానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్
రెండు ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ దివాళీ సందర్బంగా మరో సారి బిగ్‌ సేల్స్‌తో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి.ఈ రెండిటి సేల్స్ ఈ నెల 24 న ప్రారంభం కానున్నాయి. ఈ రెండుమాత్రమే కాకుండా మిగతా ఇ-కామర్స్ సైట్లూ ఫెస్టివల్ సేల్‌కు రెడీ అయిపోయాయి. దసరా సీజన్‌లో నిర్వహించిన ఫెస్టివల్ సేల్స్‌లో దిగ్గజ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ 5 రోజుల్లోనే రూ.15 వేల కోట్ల బిజినెస్ చేసాయి మరి ఈ దివాళీ సేల్స్‌లో ఎన్నివేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలయన్స్ జియో దివాళి ఆఫర్ ఏడాదంతా ఫ్రీ గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
ఫ్లిప్‌కార్ట్‌లో మరో పండుగ సేల్ ఎప్పుడంటే..
ఇండియా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో పండుగ సేల్ తేదీలను ప్రకటించింది. ఈసారి ఫెస్టివ్ ధమాకా డేస్ పేరుతో ఈ సేల్ కస్టమర్ల ముందుకు రానుంది. అక్టోబర్ 24 నుంచి 27 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. బిగ్ బిలియన్ డేస్ పేరుతో గత వారం ఓ సేల్‌ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్. వచ్చే వారమే మరో సేల్ నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని ప్రముఖ ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయని సంస్థ వెల్లడించింది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రికార్డు స్థాయిలో మొబైల్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ విక్రయించింది. అటు అమెజాన్ కూడా ఇప్పటికే వచ్చే వారం నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది.
జియో పండుగ ఆఫర్లు.. 100 శాతం క్యాష్‌బ్యాక్
రిలయెన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నది. జియో దివాలీ 100 శాతం క్యాష్‌బ్యాక్ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీని కింద రూ.149, ఆపై రీచార్జ్‌లపై వంద శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇక కొత్తగా మరో అన్‌లిమిటెడ్ ఏడాది ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. రూ.1699 ప్లాన్ కింద 365 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఇక క్యాష్‌బ్యాక్‌లు కూడా కూపన్ల రూపంలో వంద శాతం వెనక్కి వస్తాయి. మైజియోలోని మైకూపన్స్ సెక్షన్‌లో ఈ కూపన్లు ఉంటాయి. కొత్త, పాత కస్టమర్లు ఇద్దరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ రీచార్జ్‌లు చేస్తే వేటికవే కూపన్లు వస్తాయి.
నేష‌న‌ల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయాడం ఎలా ?
నేష‌న‌ల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌)ను 2004లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ పథకం 2009 నుంచి పౌరులందిరికీ వర్తింపజేశారు.ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో మాత్రమే ఉన్న ఈ సదుపాయాన్ని ఇప్పుడు ఆన్‌లైన్ చేసింది. ఈఎన్‌ఫీఎస్ పేరిట ప్రారంభమైన ఈ సిస్టమ్ ద్వారా పౌరులు ఆన్‌లైన్‌లోనే ఎన్‌పీఎస్ ఖాతా తెరుచుకోవచ్చు. టైర్ 1, టైర్ 2 అకౌంట్లలో మీ డబ్బును పొదుపు చేసుకోవచ్చు.18 నుంచి 65 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సులోని వారు ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు. 70ఏళ్ల వరకు కొన‌సాగించ‌వ‌చ్చు.అయితే వ్యక్తిగత ఎన్‌పీఎస్ అకౌంట్ తెరవడానికి ప్రతి ఒక్కరికి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో పాటు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.
రిలయన్స్ జియో దివాళి ఆఫర్ ఏడాదంతా ఫ్రీ
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు దివాళి పర్వదినాన్ని పురస్కరించుకొని బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సందర్భంగా స్పెషల్‌ యాన్యువల్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1699తో రీఛార్జ్‌ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. Asus కొత్త ఫోన్‌ల పై ఆఫర్లే ఆఫర్లు గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన OnePlus 6T లాంచ్ ఈవెంట్ వోచర్స్
OnePlus 6T విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన లాంచ్ ఈవెంట్ వోచర్స్ oneplus.inలో హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ వోచర్స్ దొరకకపోవటంతో నిరుత్సహానికి గురైన పలువరు వన్‌ప్లస్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్, న్యూఢిలీ వేదికగా అక్టోబర్ 30, 2018న ఏర్పాటు చేసిన స్పెషల్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా వన్‌ప్లస్ 6టీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
Asus కొత్త ఫోన్‌ల పై ఆఫర్లే ఆఫర్లు
తైవాన్ టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ (Asus) రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్1 (ZB556KL) అలానే జెన్‌ఫోన్ లైట్ ఎల్1 (ZA551KL) మోడల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిలో మాక్స్ ఎమ్1 మోడల్ ధర రూ.8,999గా ఉంది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,499కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. మరో 3 కొత్త ఫీచర్లను పరిచయం చేయబోతున్న వాట్సాప్ గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
అమెజాన్ సేల్ మళ్లి వస్తోంది, రెండు గంటల్లోనే డెలివరీ!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో గ్రేట్ ఇండియన్ షెస్టివల్ సేల్‌కు సిద్థమవుతోంది. 'వేవ్ 2' పేరుతో అనౌన్స్ కాబడిన ఈ సేల్ అక్టోబర్ 24, 2018న ప్రారంభమై అక్టోబర్ 28, 2018న ముగుస్తుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, హోమ్ అప్లయిన్సెస్, ఫ్యాషన్, కన్స్యూమబుల్స్, బ్యూటీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తదితర వాటిపై భారీ నుంచి అతి భారీ డిస్కౌంట్లను అందించబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిల్ల దయ్యం వీడియో గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
మరో 3 కొత్త ఫీచర్లను పరిచయం చేయబోతున్న వాట్సాప్
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ఈ దిగ్గజం తాజాగా మరో మూడు సరికొత్త ఫీచర్‌లను తీసుకొని రాబోతుంది. ఈ నేపధ్యంలో వాట్సాప్ లో రాబోతున్న ఆ కొత్త ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం. డిస్కనెక్ట్ కాబోతోన్న 50 కోట్ల మొబైల్ నెంబర్స్ గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
డిస్కనెక్ట్ కాబోతోన్న 50 కోట్ల మొబైల్ నెంబర్స్
దేశవ్యాప్తంగా 50 కోట్ల మొబైల్ నెంబర్స్ డిస్కనెక్ట్ కావచ్చు. ఆధార్ కార్డు తప్ప మరే ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వకుండా మొబైల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ఈ ప్రమాదం ఉంది. అయితే ఆధార్ కార్డు ఇచ్చి మొబైల్ కనెక్షన్లను తీసుకున్న వినియోగదారుడు కొత్త KYC ప్రక్రియకు వెళ్లవలసి ఉంటుందని కొందరు అంటున్నారు. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా తీసుకున్న సిమ్ కార్డుకి ఏదైనా ఇతర ఐడెంటిఫికేషన్ ప్రక్రియ యొక్క బ్యాకప్ లేకపోతే ఈ సిమ్ డిస్కనెక్ట్ అవుతుంది. కాల్ కనెక్టింగ్‌పై గురి పెట్టిన ట్రాయ్, టెల్కోలపై చర్యలు ! గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
ఎయిర్టెల్ ఆన్‌లైన్‌ స్టోర్‌లో గూగుల్ కొత్త ఫోన్ల ప్రీ-ఆర్డర్లు షురూ...!
సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ ప్రపంచ మార్కెట్లోకి తన కొత్త పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు 'పిక్సెల్‌ 3', 'పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌' లను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లను కొనాలని ఆసక్తి ఉన్న వారి కోసం, భారతీ ఎయిర్‌టెల్‌ తన ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. బుధవారం నుంచి తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్లను కొనాలిఅనుకున్నవారు కోనాలనుకున్నవారు డౌన్‌పేమెంట్లు కట్టి ఈఎంఐ ప్లాన్లలో వీటిని కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడే డేటా, కాలింగ్‌, కంటెంట్‌ ప్రయోజనాలతో కూడిన పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ను కంపెనీ అందించనుంది. గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిల్ల దయ్యం వీడియో
ఉంటే మనకు కనపడవేం అనేది చాలా మంది వేసే ప్రశ్న. కొందరు మాత్రం మేము దయ్యాలను చూశామని అంటే. అదంతా వారి భ్రాంతి అని హేతువాదులు కొట్టిపారేస్తుంటారు. ఇంతకీ దయ్యాలు ఉన్నాయో లేదో అనేది మాత్రం ఎప్పటికి వీడని మిస్టరీ గానే మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఓ ఒంటి కాలు దయ్యం వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆశ్చర్యానికి లోనవుతారు. సితౌలుక్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిల్ల దెయ్యాని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
ఇండియన్ రైల్వేస్ కొత్త ఫీచర్ Zero-FIR
ప్రయాణికులకు మరింత స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేసే క్రమంలో ఇండియన్ రైల్వైస్ మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రైలులో వెళుతోన్న ప్రయాణికులకు 'జీరో-ఎఫ్ఐఆర్' (Zero-FIR) సర్వీస్ అందుబాటులో ఉంటుంది. యాప్ రూపంలో అందుబాటులో ఉండే ఈ ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా రైళ్లలో ఎదురయ్యే సమస్యలను సమస్యలను ఫిర్యాదు చేసేందుకు తరువాత స్టేషన్ వచ్చేవరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
ధరలో ఆపిల్ తో పోటీ పడుతున్న హువాయి కొత్త ఫోన్లు
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ 'హువాయి' కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.హువావే 20 సిరీస్‌లో అంచనాలకు మించి వరుసగా నాలుగు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.భారీ స్క్రీన్లు, బ్యారీ స్టోరేజ్‌, భారీ బ్యాటరీ, అద్భుతైన లైకా ట్రిపుల్‌ కెమెరా , అధునాతన టెక్నాలజీ తో ఈ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి రానున్నాయి. ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ. 67,900నుంచి ప్రారంభం కానున్నాయి అయితే హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను లక్షకుపైగా రూపాయలుగా నిర్ణయించి లగ్జరీ ఫోన్లకు పెట్టింది పేరైన ఆపిల్‌కు సరికొత్త సవాల్‌ విసిరింది. గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this